దివ్యాంగుల సంక్షేమానికి కేంద్రం కృషి: ఎమ్మెల్సీ

E.G: దివ్యాంగుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. మంగళవారం ధవళేశ్వరంలోని శ్రీ కస్తూర్బా గాంధీ బాలికల ఉన్నత పాఠశాలలో ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల కోసం ఉచిత ఉపకరణాల నిర్ధారణ శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన దివ్యాంగులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు.