ద్వారపూడిలో ఘనంగా దీన్ దయాళ్ వర్ధంతి

ద్వారపూడిలో ఘనంగా దీన్ దయాళ్ వర్ధంతి

కోనసీమ: భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ 58వ వర్ధంతిని బీజేపీ నాయకులు పురస్కరించుకున్నారు. మండపేట రూరల్ మండల అధ్యక్షులు పాలిక రమణ ఆధ్వర్యంలో ద్వారపూడిలో ఇవాళ బీజేపీ శ్రేణులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ రాయి వీర్రాజు, నియోజకవర్గ మాజీ కో కన్వీనర్ కంకటాల మురళీకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.