ఈ ప్రాంతాల్లో పవర్ కట్
కోనసీమ: మామిడికుదురు మండలంలోని మగటపల్లి విద్యుత్తు ఉప కేంద్రంలో RDSS పనుల నిమిత్తం మంగళవారం మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకు సరఫరా నిలిపివేయనున్నారు. ఈ మేరకు ఈఈ కే. రాంబాబు ఓ ప్రకటనలో తెలిపారు. ఉప కేంద్రం పరిధిలోని గ్రామాలకు ఆ సమయంలో సరఫరా ఉండదన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.