'నానో యూరియాతో అధిక దిగుబడి'

NLG: రైతులు నానో యూరియా ఉపయోగించడం వల్ల ఖర్చు తగ్గడం తోపాటు, అధిక దిగుబడి ని సాధించవచ్చని దామరచర్ల మండల వ్యవసాయ అధికారి రూషేంద్రమని చెప్పారు. గురువారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. నానో యూరియా రైతులకు అందుబాటులో ఉందని చెప్పారు. దీనిని వాడడం వల్ల పంటలకు పూర్తిస్థాయిలో నత్రజని అందుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమములో ఏఈవోలు పాల్గొన్నారు.