డీఎంకే మ్యానిఫెస్టో విడుదల
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో డీఎంకే అధినేత స్టాలిన్ తమ పార్టీ మ్యానిఫెస్టోను విడుదల చేశారు. రాష్ట్రంలో బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని కొనసాగిస్తామని చెప్పారు. అలాగే 20 లక్షల మందికి ఉచిత కరెంట్, వృద్ధ్యాప్య పింఛన్లను రూ.2 వేలకు పెంపు, యువతకు ఉచిత ల్యాప్‌ట్యాప్‌లు, రైతులకు ఉచితంగా మీటర్ లేని పంపు సెట్లు, సీఎం హెల్త్ స్కీమ్ రూ.10 లక్షలకు పెంపు వంటి హామీలను ప్రకటించారు.