జిల్లాలో నమోదైన వర్షపాతం వివరాలు
KMM: జిల్లాలో బుధవారం ఉ.8:30 నుంచి గురువారం ఉ.8:30 వరకు 83.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని జిల్లా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కామేపల్లి 23.2, రఘునాథపాలెం 16.2, నేలకొండపల్లి 15.2, కూసుమంచి 10.2, తల్లాడ 5.8, ఏన్కూరు 4.4, కల్లూరు 4.2, ఎర్రుపాలెం 2.0, సింగరేణి 1.8 మిల్లీమీటర్లు నమోదైనట్లు పేర్కొన్నారు.