ఇంచెన్ చెరువు పల్లెలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
MLG: వెంకటాపూర్ మండలం ఇంచన్ చెరువు పల్లె గ్రామంలో ఇవాళ ఏపీఎం.దామోదర్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ధాన్యం కొనుగోలు చేయాలని నిర్వాహకులకు సూచించారు. అలాగే, రైతులు పండించిన ధాన్యాన్ని తమ అందుబాటులో అమ్ముకునే విధంగా ప్రభుత్వం ఈ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.