వసతిగృహం నుంచి బాలికలు అదృశ్యం
TPT: తిరుపతి సాయినగర్ పంచాయతీ బైరాగిపట్టెడలోని మాతృశ్య వసతి గృహం నుంచి ఇద్దరు చిన్నారులు తప్పిపోవడంతో నిర్వాహకులు పోలీసులను ఆశ్రయించారు. నగరంలోని జీవకోనకు చెందిన 12 ఏళ్ల బాలిక, గొల్లపల్లికి చెందిన 8 ఏళ్ల బాలిక అదృశ్యమైనట్లు నిర్వాహకులు వారి చిత్రాలను మంగళవారం మీడియాకు విడుదల చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చిన్నగోవిందు తెలిపారు.