VIDEO: గాయపడిన టెన్త్ విద్యార్థికి పోలీసులు సాయం

VIDEO:  గాయపడిన టెన్త్ విద్యార్థికి పోలీసులు సాయం

KDP: కాలుకు గాయమై నడవలేని స్థితిలో పదో తరగతి పరీక్ష రాసేందుకు వల్లూరు మోడల్ స్కూల్‌కు వచ్చిన విద్యార్థి పట్ల పోలీసులు మానవత్వం చాటుకున్నారు. బందోబస్తులో విధులు నిర్వర్తిస్తున్న పోలీసులు విద్యార్థిని తమ భుజాలపై ఎత్తుకుని పరీక్షా గది వరకు చేర్చారు. విద్యార్థికి సాయం చేసిన పోలీసులపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.