'అనధికారిక స్టాకింగ్ చేస్తే కఠిన చర్యలు'
KMR: నిజాంసాగర్ రిజర్వాయర్లో రాష్ట్ర ప్రభుత్వం, మత్స్యశాఖ ఆధ్వర్యంలో 100% ఉచిత గ్రాంట్‌తో చేప, రొయ్య పిల్లల పెంపకం కార్యక్రమం చేపడుతోంది. అనధికారిక సంఘాలు సొంతంగా చేప, రొయ్య పిల్లలను వదలడం పూర్తిగా నిషేధించారు. మత్స్య సంపదపై పూర్తి హక్కులు ప్రభుత్వానికే ఉంటాయి. మత్స్యకారులు ప్రైవేటుగా సీడ్ వేసి ఆర్థికంగా నష్టపోవద్దని, చట్టపరమైన ఇబ్బందులు పడొద్దని అధికారులు పేర్కొన్నారు.