ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యమిస్తోంది: MP
BHPL: మున్సిపాలిటీలోని మంజూరునగర్ ఇల్లంద క్లబ్‌లో జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి యువజనోత్సవాలు ఇవాళ ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవానికి వరంగల్ ఎంపీ కడియం కావ్య, MLA గండ్ర సత్యనారాయణ రావు ముఖ్య అతిథులుగా హాజరై, వివేకానంద చిత్రపటానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ.. ప్రభుత్వం క్రీడలకు, యువతకు ప్రాధాన్యమిస్తోందన్నారు.