బీజేపీ కార్యాలయం ముట్టడిలో పాల్గొన్న రాయల
KMM: హైదరాబాద్ గాంధీ భవన్‌లో నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ఈడీ తప్పుడు కేసులు పెట్టిందని ఆరోపిస్తూ, ఏఐసీసీ బీజేపీ కార్యాలయాల ముట్టడికి పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయం ముట్టడి కార్యక్రమంలో ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నేత, రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ ఛైర్మన్ రాయల నాగేశ్వరరావు పాల్గొన్నారు.