ఆర్టీసీ బస్సులో కల్లుకు అనుమతి లేదు: ఆర్ఎం

NLG: RTC బస్సులలో కల్లు తీసుకెళ్లడానికి అనుమతి లేదని NLG ఆర్టీసీ రీజినల్ మేనేజర్ K.జానిరెడ్డి స్పష్టం చేశారు. నకిరేకల్‌లో ఓ మహిళ ఆర్టీసీలో కల్లు తీసుకెళ్తుండగా సిబ్బంది అడ్డుకున్న విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై వివరణ కోరగా స్పష్టతనిచ్చారు. బస్సులలో కల్లు, మద్యం, పేలుడు పదార్థాలు, పచ్చి మాంసం,పెంపుడు జంతువులను తీసుకెళ్లడానికి పర్మిషన్ లేదన్నారు.