కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
VKB: చేవెళ్ల సహకార సంఘం కార్యాలయంలో సోమవారం ఎమ్మెల్యే కాలే యాదయ్య మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దళారులను నమ్మి మోసపోవద్దని, రైతులందరూ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించుకోవాలని కోరారు. ప్రభుత్వం క్వింటాకు రూ.2400 కనీస మద్దతు ధర కల్పిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ ఛైర్మన్ దేవర వెంకట్‌రెడ్డి ఉన్నారు.