VIDEO: 'పవన్ కళ్యాణ్ బాబు.. మా దాహం తీర్చండి'
ASR: జిల్లాలోని అనంతగిరి మండలం రొంపిల్లి పంచాయితీ మారుమూల గ్రామమైన దెబ్బలపాడు కొండ శిఖర గ్రామం. అక్కడ 8 కుటుంబాల వారు జీవనం సాగిస్తూ ఉన్నారు. జ్వరం వస్తే ఏడు కిలోమీటర్లు డోలు మోసుకొని వెళ్లే పరిస్థితి. తాగునీటి కోసం వెళ్లాలంటే కొండపైకి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. కాబట్టి "ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బాబు మా దాహం తీర్చండి " అంటూ కోసూరు అప్పన్న దొర కోరుతున్నారు.