VIDEO: దుర్కి సోమలింగేశ్వరాలయంలో దీపోత్సవం
KMR: నస్రుల్లాబాద్ మండలం దుర్కి శివారులోని సోమలింగేశ్వరాలయం భక్తులతో కిక్కిరిసింది. కార్తీక పౌర్ణమి కావడంతో మహిళలు శివాలయాల్లో ఈరోజు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలో స్వామి వారికి కుంకుమార్చన, అభిషేకం నిర్వహించారు. శివాలయాల్లో మహిళలు పెద్ద ఎత్తున దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొని తమ మొక్కులు తీర్చుకున్నారు.