సీఎం చిత్రపటానికి పాలాభిషేకం
WGL: తెలంగాణ అసెంబ్లీలో అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ బిల్లుకు ఆమోదం తెలిపిన సందర్భంగా CM రేవంత్ రెడ్డి, స్థానిక MLA దొంతి మాధవరెడ్డి చిత్రపటాలకు నర్సంపేట బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు. చట్టం న్యాయవాదుల గౌరవం, భద్రతను మరింత పెంపొందిస్తుందని బార్ అసోసియేషన్ నాయకులు రమేష్ యాదవ్ అన్నారు. ఈ కార్యక్రమంలో అడ్వకేట్లు పాల్గొన్నారు.