అమెరికా నుంచి తేజస్ కోసం కీలక ఇంజిన్

అమెరికా నుంచి తేజస్ కోసం కీలక ఇంజిన్

భారత ప్రభుత్వ సంస్థ హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(HAL) అమెరికా నుంచి మూడవ GE-404 ఇంజిన్‌ను అందుకుంది. ఈ ఇంజిన్‌ను తేజస్ మార్క్-1A యుద్ధ విమాన కార్యక్రమంలో ఉపయోగించనున్నారు. అంతేకాకుండా, ఈ నెలాఖరు నాటికి నాలుగవ ఇంజిన్ కూడా భారతదేశానికి చేరుకుంటుందని రక్షణ అధికారులు తెలిపారు.ఈ ఇంజిన్లు యుద్ధ విమానాల తయారీలో కీలకంగా మారనున్నాయి.