ఈనెల 27న ఉచిత కంటి వైద్య శిబిరం
GDWL: రాజోలి గ్రామ మాజీ ఉపసర్పంచ్ కీ.శే. శ్రీరామ్ జయంతి పురస్కరించుకుని ఈనెల 27వ తేదీన గ్రామంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు. స్థానిక తెలంగాణ రైతు ఆగ్రోస్ సేవా కేంద్రం-2 వద్ద ఈ శిబిరం ఏర్పాటు చేయనున్నట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. అవసరమైన వారికి మందులు పంపిణీ చేస్తారని శ్రీరామ్ రెడ్డి సతీమణి, ప్రస్తుత ఉపసర్పంచ్ సంధ్య పేర్కొన్నారు.