జేసీబీ సాయంతో చెట్లు తొలగింపు
MHBD: ఇనుగుర్తి మండలం అయ్యగారిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని కట్టుకాలువ తండాకు వెళ్లే రోడ్డుకు ఇరువైవులా చెట్లు పెరిగి వాహనదారులకు ఇబ్బందిగా మారింది. ఈ సమస్యను గుర్తించిన అదే తండాకు చెందిన భూక్యా శోభన్ బాబు ఆదివారం సొంత ఖర్చులతో జేసీబీ సాయంతో చెట్లను తొలగించారు. దీంతో తండావాసులు, ప్రయాణికులు ఆయనను అభినందించారు.