అదిరిపోయే ఫొటో.. ఓకే బైక్‌పై కలెక్టర్, ఎస్పీ

అదిరిపోయే ఫొటో.. ఓకే బైక్‌పై కలెక్టర్, ఎస్పీ

తిరుపతి: జిల్లాలో ప్రతి ఒక్కరూ హెల్మెట్ వాడేలా పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా 'నో హెల్మెట్.. నో పెట్రోల్' రూల్ అమలు చేస్తున్నారు. హెల్మెట్ వాడకంపై అవగాహన కల్పిస్తూ తిరుపతి పోలీస్ పరేడ్ గ్రౌండ్ నుంచి ఎస్పీ ఆఫీస్ వరకు 700 బైకులతో ర్యాలీ చేపట్టారు. ఎస్పీ సుబ్బరాయుడు బైక్ నడపగా.. కలెక్టర్ వెంకటేశ్వర్ సైతం హెల్మెట్ ధరించి వెనుక కూర్చున్నారు.