'ప్రతీ ఒక్క రైతుకు యూరియా అందుతుంది'

AKP: కశింకోట మండలం ఉగ్గినపాలెం రైతు సేవా కేంద్రంలో శుక్రవారం రైతులకు యూరియా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మండల టీడీపీ ఉపాధ్యక్షులు కలగా సోమేశ్వరరావు మాట్లాడుతూ.. రైతులకు అవసరమైన యూరియా ప్రభుత్వం అందుబాటులోకి తేనుందని అన్నారు. యూరియా పంపిణీ విషయంలో రైతులు ఎటువంటి అపోహలకు గురికావద్దని, ప్రతీ ఒక్క రైతుకు యూరియా అందుతుందని చెప్పారు.