మహిళలు, రైతులకు ప్రభుత్వం అండగా ఉంది: ఎమ్మెల్యే

SKLM: కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ప్రజల సంక్షేమం కోసం ఎన్నో కొత్త పథకాలను తీసుకువచ్చి అమలు చేస్తున్నామని నరసన్నపేట ఎమ్మెల్యే బొగ్గు రమణ మూర్తి తెలిపారు. నేడు జలుమూరు మండలం చల్లవానిపేట సచివాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన నూతన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి హాజరై కార్డులు పంపిణీ చేశారు. మహిళలు, రైతులకు ప్రభుత్వం అండగా ఉందని ఆయన తెలిపారు.