ఓటు హక్కు వినియోగించుకున్న 92 ఏళ్ల వృద్ధుడు
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల పరిధిలోని తూర్పుగూడెం గ్రామానికి చెందిన 92 ఏళ్ల పడిదెల రామరావు అనే వృద్ధుడు తూర్పుగూడెం పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కును ఇవాళ వినియోగించుకున్నారు. ఇప్పటివరకు ఏ ఎన్నికలోనూ మిస్ చేయకుండా ఓటు వేసినట్లు తెలిపారు. వృద్దులు ఓటేసేందుకు సుముఖత చూపడం చాలా మందికి స్పూర్తినిస్తోంది. 92ఏళ్ల వృద్ధుడు ఓటు వేయడం పట్ల అభినందించారు.