"రేపు పనుల జాతర కార్యక్రమం"

MHBD: గూడూరు మండల పరిధిలోని అన్ని గ్రామ పంచాయతీలలో శుక్రవారం వివిధ రకాల అభివృద్ధి పనులను ప్రారంభించుటకు పనుల జాతర కార్యక్రమం నిర్వహించనున్నట్లు మండల పరిషత్ అభివృద్ధి అధికారి వీరస్వామి తెలిపారు. ఆయా పంచాయతీ ప్రత్యేక అధికారుల ఆధ్వర్యంలో కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు, గ్రామ ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.