రాష్ట్రస్థాయి కబడ్డీలో NZB బాలికల శుభారంభం
NZB: నల్గొండ జిల్లా అలియాలో జరుగుతున్న రాష్ట్రస్థాయి జూనియర్ కబడ్డీ ఛాంపియన్‌షిప్‌లో జిల్లా బాలికల జట్టు వరుస విజయాలతో శుభారంభం పలికింది. మొదటి మ్యాచ్‌లో ఆసిఫాబాద్ జట్టును 56-19 పాయింట్ల తేడాతో ఓడించింది. అనంతరం జరిగిన రెండో మ్యాచ్‌లో వికారాబాద్ జట్టుపై కూడా తమదైన ప్రతిభను కనబరిచి 51-34 పాయింట్ల తేడాతో గెలుపొందింది.