'సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి'
SKLM: కూటమి ప్రభుత్వం చేపడుతున్న రైతు సంక్షేమ పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవో కోటేశ్వర ప్రసాద్ తెలిపారు. బుధవారం నరసన్నపేట మండలం చోడవరం రైతు సేవా కేంద్రంలో రైతులతో సమావేశం అయ్యారు. ఆయన మాట్లాడుతూ.. ఇటీవల ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేసిందని దీనిలో ఎవరికైనా పథకం వర్తించకపోతే అధికారులను సంప్రదించాలని ఆయన సూచించారు.