రెవెన్యూ అధికారులతో సమీక్షించిన కలెక్టర్
KRNL: కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి శుక్రవారం జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి రెవెన్యూ అంశాలపై ఆర్డీవోలు, మండల తహసీల్దార్లు, సర్వేయర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. రెవెన్యూ సేవల పారదర్శకత, పెండింగ్ సమస్యల పరిష్కారం, భూ సర్వే పనుల పురోగతిపై వివరాలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్‌వో వెంకట్ నారాయణమ్మ పాల్గొన్నారు.