'వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి'
KMM: వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఇన్‌స్పెక్టర్ సత్యనారాయణ అన్నారు. నగరంలో నెంబర్ ప్లేట్ లేకుండా తిరుగుతున్న ద్విచక్ర వాహనాలపై ట్రాఫిక్ పోలీసులు బుధవారం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఇన్‌స్పెక్టర్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టి నిబంధనలు ఉల్లంఘించిన వారికి సుమారు రూ. 14 వేల జరిమానా విధించారు. రాంగ్ డ్రైవింగ్‌కు రూ.1700 జరిమానా వేశారు.