నల్లచెరువు పాఠశాలలో క్షుద్ర పూజల కలకలం

నల్లచెరువు పాఠశాలలో క్షుద్ర పూజల కలకలం

సత్యసాయి జిల్లాలో క్షుద్రపూజల ఘటన కలకలం రేపింది. నల్లచెరువు మండల జిల్లా పరిషత్ హై స్కూల్‌లో క్షుద్రపూజలు చేశారు. గమనించిన సిబ్బంది వెంటనే అనవాళ్లను చెరిపివేశారు. ఈ నేపథ్యంలో స్కూల్‌కి వెళ్లాలంటే విద్యార్థులు భయపడుతున్నారు. మరోవైపు ఈ ఘటన పట్ల స్కూల్ ప్రాంగణం వద్ద విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు.