గుండెపోటుతో నవోదయ ఉపాధ్యాయుడు మృతి

VZM: శృంగవరపుకోట మండలం కేల్తం పాలెం నవోదయలో పీఈటీగా విధులు నిర్వహిస్తున్న మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రదీప్ భారత్ అనే 32 సంవత్సరాల ఉపాధ్యాయుడు గుండెపోటుతో శనివారం ఉదయం మృతి చెందినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు దుర్గాప్రసాద్ తెలియజేశారు. వీరి మృతి పట్ల పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు తీవ్ర దుఃఖానికి లోనయ్యారు.