గుండెపోటుతో ఎంపీడీవో మృతి
MLG: వెంకటాపురం MPDOగా విధులు నిర్వహిస్తున్న జి. రాజేంద్రప్రసాద్ గుండెపోటుతో మృతి చెందాడు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఆయన బుధువారం మూడో విడత ఎన్నికలను పర్యవేక్షించారు. అయితే ఓట్ల లెక్కింపు అనంతరం యంత్రాంగానికి చెల్లించే పారితోషికం విషయంలో కొందరు వాగ్వాదానికి దిగడంతో ఒత్తిడికి గురై కుప్పకూలిపోవడంతో ఉద్యోగులు ఆసుపత్రికి తరలించగా, వరంగల్ లో చికిత్స పొందుతూ మృతి చెందాడు.