వరంగల్‌‌లో రైతు దినోత్సవ వేడుకలు

వరంగల్‌‌లో రైతు దినోత్సవ వేడుకలు

వరంగల్‌లో రైతు దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో చాంబర్ ఆఫ్ కామర్స్, మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో రైతులకు ఘనంగా సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతుల సేవలను కొనియాడుతూ, వారి సంక్షేమానికి నిరంతరం కృషి చేయాలని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు రైతులు, వ్యాపారులు, అధికారులు పాల్గొన్నారు.