VIDEO: మోదీపై వ్యాఖ్యలు.. ఖర్గేపై బీజేపీ ఆగ్రహం
JGL: ధర్మపురిలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే వ్యాఖ్యలను నిరసిస్తూ బీజేపీ నాయకులు ఆందోళన చేపట్టారు. స్థానిక గాంధీ విగ్రహం వద్ద పట్టణ అధ్యక్షుడు గాజు భాస్కర్ ఆధ్వర్యంలో ఖర్గే దిష్టి బొమ్మను దగ్దం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని, కాంగ్రెస్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.