నిరుపేద గిరిజన విద్యార్థికి మాజీ ఎమ్మెల్యే ఆర్థిక సహాయం

NGKL: తాడూరు మండలం పర్వతాయపల్లి తండాకు చెందిన నిరుపేద గిరిజన విద్యార్థి మాడవత్ అనూష అనే అమ్మాయికి హైదరాబాద్ శ్రీ హిందూ ఇంజనీరింగ్ కాలేజీలో సీటు వచ్చింది. ఆర్థిక ఇబ్బందుల వల్ల హాస్టల్ ఫీజ్ కట్టలేక ఇబ్బందులు పడుతున్న విషయాన్ని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి దృష్టికి తీసుకురావడంతో ఆయన వెంటనే స్పందించి శుక్రవారం రూ. 50,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు.