పరిశ్రమల స్థాపనకు ముందుకు రావాలి

VZM: ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను వినియోగించుకొని, రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు ముందుకు రావాలని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో 175 ఎంఎస్ఎంఈ పార్కులను ఏర్పాటు చేసే కార్యక్రమంలో భాగంగా జిల్లాకు మొదటి విడతలో మంజూరైన నాలుగు పార్కుల్లో, మొట్టమొదటి పార్కుకు బలిఘట్టంలో శుక్రవారం శంకుస్థాపన చేశారు.