కాంటీన్‌ను తనిఖీ చేసిన ఆదోని కమిషనర్

NDL: అన్న క్యాంటీన్లలో నాణ్యమైన భోజనం అందించాలని ఆదోని మున్సిపల్ కమిషనర్ కృష్ణ అన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆదోని నిర్మల్ టాకీస్ రోడ్ క్యాంటీన్‌ను తనిఖీ చేసి, మెనూ ప్రకారమే భోజనం అందించాలని సూచించారు. ప్లేట్లు శుభ్రంగా ఉండాలని, తాగునీరు అందుబాటులో ఉండాలని తెలిపారు. పరిసరాలను శుభ్రంగా ఉంచాలని పేర్కొన్నారు.