'అభివృద్ధి పనులలో నాణ్యత ప్రమాణాలు తప్పనిసరి'

GNTR: గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని పలు డివిజన్లలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఎమ్మెల్యే గళ్ళా మాధవి శనివారం ప్రత్యక్షంగా పర్యటించి పరిశీలించారు. ప్రజల సమస్యలను విని వాటి పరిష్కారం కోసం స్వయంగా ద్విచక్రవాహనం నడుపుతూ పర్యటించారు. నాసిరకం పనులు సహించబోమని స్పష్టం చేశారు.