ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి: మంత్రి

సిద్దిపేట: ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈ సందర్భంగా హుస్నాబాద్ బస్టాండ్ ఆయన ఆకస్మికంగా పరిశీలించారు. ప్రయాణికులతో ముచ్చటించి వారి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. ఆర్టీసీ సంస్థను బలోపేతం చేసేందుకు అన్ని విధాలుగా కృషి చేస్తున్నామన్నారు.