ఒకేరోజు మూడు చోట్ల అగ్ని ప్రమాదాలు.. భారీగా పంట నష్టం
NTR: కంచికచర్ల, వీరులపాడు మండలాల్లో పలుచోట్ల అగ్నిప్రమాదాలు జరిగినట్లు ఫైర్ స్టేషన్ ఎస్‌ఎఫ్‌వో శివారెడ్డి తెలిపారు. వీరులపాడు మండలం నరసింహారావుపేటలో సుబాబుల్ తోట దగ్ధమై సుమారు లక్ష రూపాయల పంట నష్టం జరిగినట్లు చెప్పారు. అలాగే గండేపల్లిలో మొక్కజొన్న పంట, వేములపల్లిలో మరో సుబాబుల్ తోట అగ్నికి ఆహుతైనట్లు వివరించారు. రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.