VIDEO: మహాశివరాత్రి సందర్భంగా 5k రన్
WGL: పర్వతగిరి మండల కేంద్రంలో మహాశివరాత్రి సందర్భంగా ఆర్డిఫ్ ఇనిస్టిట్యూట్ ఆధ్వర్యంలో ఇవాళ 5 కిలోమీటర్ల స్నేహపూర్వక పరుగు పందెం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, యువకులు, క్రీడాభిమానులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పోటీలో పాల్గొన్న వారికి ఆర్డీఎఫ్ ఛైర్మన్ రామ్మోహన్ రావు బహుమతులు అందజేశారు. యువతలో క్రీడాస్ఫూర్తి, ఆరోగ్య చైతన్యం పెంపొందించడమే లక్ష్యమన్నారు.