పల్లెబొగుడ తండా సర్పంచ్ ఏకగ్రీవం

పల్లెబొగుడ తండా సర్పంచ్ ఏకగ్రీవం

KMR: నాగిరెడ్డిపేట మండలం పల్లెబొగుడ తండా గ్రామ పాలకవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. గ్రామ సర్పంచ్‌గా ధనవత్ పార్వతి శంకర్, ఉప సర్పంచ్‌గా వినీత వినోద్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు గ్రామస్థులు తెలిపారు. వార్డు సభ్యులుగా ధనావత్ గోవింద్, ఆంబోతు ముత్యాలి, రాందాస్, సునీత, శాంత, బలరాం, సేవుల కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పాలకవర్గం ఏకగ్రీవం కావడంతో గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేశారు.