డిగ్రీ కళాశాలలో ప్రజాస్వామ్య దినోత్సవ వేడుకలు

డిగ్రీ కళాశాలలో ప్రజాస్వామ్య దినోత్సవ వేడుకలు

SRD: సంగారెడ్డిలోని తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ప్రిన్సిపల్ ప్రవీణ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యం ఉన్న దేశంలోని అభివృద్ధి జరుగుతుందని చెప్పారు. రాజనీతి శాస్త్రం ఎన్ఎస్ఎస్ విభాగాల ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రజాస్వామ్యంపై వ్యాసరచన, ఉపన్యాస పోటీలను నిర్వహించారు.