సాగునీరు నిలిచేదెలా?

SKLM: ఎల్.ఎన్.పేట మండలం మల్లికార్జునపురంలోని వంశధార కుడి ప్రధాన కాలువ 15. 466 కిలో మీటర్ వద్ద ఉన్న హెడ్ రెగ్యులేటర్ షట్టర్లు శిథిలావస్థకు చేరుకున్నాయి. సుమారు 5 వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు వంశధార కుడి ప్రధాన కాలువను 2006లో నిర్మించారు. షట్టర్లు శిథిలావస్థకు చేరుకోవడంతో కాలువలో నీరు నిలవడం లేదని రైతుల ఆందోళన చెందుతున్నారు. మరమ్మతులు చేయాలని కోరుతున్నారు.