వేదాయపాలెంలో పర్యటించిన మున్సిపల్ కమిషనర్

వేదాయపాలెంలో పర్యటించిన మున్సిపల్ కమిషనర్

నెల్లూరు జిల్లాలోని 22వ డివిజన్ పరిధదిలో బి. వి నగర్, జనశక్తి నగర్, ఓల్డ్ వేదాయపాలెం ప్రాంతాలలో మున్సిపల్ కమిషనర్ నందన్ బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య పనులను, నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లు, డ్రైన్ కాలువల నాణ్యతను ఆయన తనిఖీ చేశారు. డ్రైన్ కాలువల నిర్మాణం నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగానే చేపట్టాలని, మురుగునీటి ప్రవాహం సాఫీగా జరిగేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.