కీసర వెదర్ రిపోర్ట్.. మరో మూడు రోజులు ఉక్కపోత..!

మేడ్చల్: కీసర పరిసర ప్రాంతాలలో గత 24 గంటల్లో 32.4 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసినట్లు తెలంగాణ రాష్ట్ర వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే మూడు రోజుల వరకు ఉక్కపోత వాతావరణం ఏర్పడే అవకాశం ఉన్నట్లుగా అంచనా వేసింది. మరోవైపు గరిష్ట ఉష్ణోగ్రతలు 32 డిగ్రీలుగా నమోదు అయినట్లుగా పేర్కొంది. ఇప్పటికీ కీసర ప్రాంతంలో లోటు వర్షపాతం ఉండటంతో, పలుచోట్ల రైతన్నలు పంట సాగు ప్రారంభించలేదు.