రాష్ట్ర పండుగగా భక్త కనకదాస జయంతి
AP: భక్త కనకదాస జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈనెల 8వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా వేడుకలను వైభవంగా జరపాలని నిర్ణయించినట్లు మంత్రి సవిత తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసిందని ఆమె వెల్లడించారు. అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో జరిగే వేడుకలకు మంత్రి లోకేష్ హాజరవుతారని మంత్రి పేర్కొన్నారు.