వరి నాట్లు వేసిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు
NLR: దగదర్తిలోని జిల్లా ప్రజా పరిషత్ హై స్కూల్ విద్యార్థులు శనివారం క్షేత్ర పర్యటనకు దగదర్తి పట్టణంలోని పొలాలను సందర్శించారు. స్వయంగా పొలాల్లోకి వెళ్లి వరి నాట్లు వేశారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు కరిముల్లా మాట్లాడుతూ.. విద్యార్థులు క్షేత్ర పర్యటన ద్వారా ప్రత్యక్ష అనుభవాలు పొందుతారన్నారు.