ఇందిరా మహిళా శక్తి చీరలను పంపిణీ చేసిన మంత్రి
SDPT: కోహెడ మండల కేంద్రంలో రైతు వేదిక వద్ద ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమం ఇవాళ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్నికి ముఖ్య అతిథిగా మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. ఈ మేరకు ఆయన మహిళలకు బొట్టు పెట్టీ ఇందిరా చీరలను (సారే) అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మహిళా సంఘాలకు మా ప్రభుత్వం 10 సంవత్సరాలుగా లేని వడ్డీలేని రుణాలు ఇవ్వడం జరిగిందన్నారు.