గ్రామ పరిరక్షణ కోసం కృష్ణానది ఒడ్డున నిరసన

కృష్ణా: అవనిగడ్డ మండలంలోని నదీగర్భ గ్రామమైన పాత యడ్లంక ప్రజలు తమ గ్రామ పరిరక్షణ కోసం కృష్ణా నది ఒడ్డున నిరసన దీక్ష శుక్రవారం నిర్వహించారు. గ్రామం చుట్టూ రాతిపేపుడు పనులు చేపట్టి వరద ముప్పు తగ్గించాలని, ఇళ్లను కోల్పోయిన కుటుంబాలకు కొత్త గృహాలు కట్టించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.